telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

ఎలుకల కోసం .. ప్రత్యేకంగా కార్ల రూపకల్పన.. అవే నడుపుకుంటూ..

rats driving special cars as part of

ఎలుకలు కార్లు నడుపుతాయ్ అంటే అదేదో కార్టూన్ చిత్రం అనుకోకూడదు సుమా .. నిజంగానే జరిగింది.. విజువల్స్‌ కూడా ఉన్నాయి. అయితే అవి పెద్ద.. పెద్ద ఆడి, బెంజ్ కార్లు కాదు. తమ సైజ్‌కి తగ్గట్టుగా ఉండే స్పెషల్ డిజైన్డ్ కార్స్. అమెరికాలోని వర్జినియాలో గల రిచ్మండ్ యూనివర్శిటీ పరిశోధకులు ఎలుకల కోసం స్పెషల్ కార్లను రూపొందించి ప్రయోగాలు చేపట్టారు. ఎలుకలూ కార్లను నడపగలవని ప్రూవ్ చేశారు. ఇందుకోసం సైంటిస్టులు స్పెషల్ స్కెచ్ డిజైన్ చేశారు. ప్రత్యేక కార్లలో ఎలుకలను ఉంచి.. ఓ పెద్ద ప్లాస్టిక్ డబ్బాలో పెట్టారు. వాటి నోరు మాత్రమే పట్టే విధంగా ఒక చిన్న హోల్ మాత్రమే ఉంచారు. కొంతదూరంలో ఎలుకలు ఇష్టంగా తినే ఆహారాన్ని పెట్టారు. కారులో నుంచి బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో ఎలుకలు తప్పకుండా కారు నడపాలి. ఆ కారును నడపాలంటే ఎలుకలు తన తెలివి తేటలను ఉపయోగించాలి.

సైంటిస్టులు ఉపయోగించిన ఈ స్పెషల్ టెక్నిక్ వర్కవుట్ అయ్యింది. ఆహారం వద్దకు చేరేందుకు అవి ఆ కార్లను డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాయి. విజయవంతంగా తమకు నచ్చిన ఆహారాన్ని ఆమ్..ఆమ్ అంటూ లాగించేశాయి. సైంటిస్టులు మొత్తం 11 మగ, 6 ఆడ ఎలుకలపై ఈ ఎక్సపరిమెంట్ చేశారు. మానవుల్లో పెరుగుతోన్న ఒత్తిడి, ఆత్రుతను తగ్గించేందుకు పరిష్కారాలు కనుగునేందుకు ఈ ప్రయోగం చేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.

Related posts