telugu navyamedia
సినిమా వార్తలు

‘ఏయ్​ బిడ్డ​ ఇది నా అడ్డ’“పుష్ప” నుంచి క్రేజీ అప్డేట్..

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్​ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప. ఇందులో అల్లు అర్జున్ పుష్ప‌రాజ్‌గా, ఆయన ప్రేయసి శ్రీవల్లిగా రష్మిక న‌ట‌స్తున్నారు.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ‘పుష్ప ది రైజ్‌’ పేరుతో మొదటి భాగాన్ని డిసెంబర్‌ 17న విడుద‌ల కానుండి. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్​ ఫ్యాన్స్​ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా ‘పుష్ప’ సినిమా నుంచి మరో కొత్త అప్డేట్​ వచ్చింది. ఈ చిత్రంలోని నాలుగో పాటను నవంబరు 19న రిలీజ్​ చేయనున్నట్లు తెలుపుతూ ఓ కొత్త పోస్టర్​ను విడుదల చేశారు చిత్ర యూనిట్‌. ఈ చిత్రంలోని నాలుగో పాట ‘ఏయ్​ బిడ్డ​ ఇది నా అడ్డ’ను నవంబరు 19న రిలీజ్​ చేయనున్నట్లు తెలిపుతూ ఓ కొత్త పోస్టర్​ను విడుదల చేసింది. ఇందులోని అల్లు అర్జున్​ కొత్త లుక్​ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. నుదుటన బొట్టు, ఒంటినిండా బంగారపు చైన్లు, ఉంగరాలతో కళ్లజోడు పెట్టుకుని సరికొత్త అవతారంలో కనిపించారు.

ఈ చిత్రాన్ని భారీ బడ్జె్ట్‏తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. మాలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషిస్తుండ‌గా.. .జగపతి బాబు, సునీల్, అనసూయ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు

Related posts