telugu navyamedia
సినిమా వార్తలు

సూర్యకి ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చిన కమల్‌..

క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన తాజా చిత్రం విక్ర‌మ్ సినిమాతో భారీ విజ‌యాన్ని అందుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్​ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం బాక్సాఫీసు కలెక్షన్లు రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది.. త్వరలోనే ఈ చిత్రం 500 మార్క్​ను అందుకుంటదని సినీ విశ్లేషకులు వెల్లడించారు.

Breaks! Kamal Haasan presents Surya with a becoming reward in honor of Rolex Sarai – Tamil Information ‣ AllMaa

ఈ సక్సెస్ లో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన కమల్, కొందరికి అరుదైన బహుమతులు ఇస్తున్నారు.
నిన్న ఈ మూవీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కి కమల్ హాసన్ ఖరీదైన కారు, 13 మంది అసిస్టెంట్‌ డైరెక్టర్లకు రూ.1.45 లక్షలు విలువ చేసే బైక్‌లను బహుమతిగా ఇచ్చాడు.

Kamal Haasan gifts luxury car to 'Vikram' director Lokesh Kanakaraj, new bikes to 13 assistant directors

తాజాగా హీరో సూర్యకు ఖరీదైన బహుమతి ఇచ్చారు. గడియారాల్లో లగ్జరీ బ్రాండ్ గా ఉన్న రోలెక్స్ వాచ్ని సూర్యకు గిఫ్ట్ గా తెచ్చారు. కమల్ హాసన్ స్వయంగా సూర్య చేతికి రోలెక్స్ వాచ్ అలంకరించారు.

Image

విక్రమ్ మూవీలో క్లైమాక్స్‌లో డ్రగ్స్‌ మాఫీయా లీడర్‌ రోలెక్స్‌గా ఎంట్రీ ఇచ్చిన సూర్య.. చివరి మూడు నిమిషాలు దుమ్ముదులిపేశాడు. కేవలం కమల్‌ హాసన్‌ కోసమే సూర్య ఈ పాత్రలో నటించడానికి ఒప్పుకున్నాడట. ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్‌ తీసుకోలేద‌ట‌.

విక్రమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ నేపథ్యంలో కమల్ హాసన్ తన సొంత రోలెక్స్ వాచ్‌ను హీరో సూర్యకు రోలెక్స్ వాచ్ బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్ని హీరో సూర్య సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించాడు.

Kamal Haasan Gifts Rolex Watch To Suriya After Monster Success Of Vikram Movie Photos

ఇలాంటి క్షణమే జీవితాన్ని అందంగా మారుస్తుంది. థ్యాంక్స్‌ అన్నయ్యా’ అంటూ ఆ ఫోటోలను ట్విటర్‌లో షేర్‌ చేశాడు సూర్య. ఈ వాచ్‌ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

Related posts