telugu navyamedia
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ .. సాయం, పిలుపు.. పుల్వామా ఘటన.. 

Vijay-Devarakonda
పుల్వామా ఘటనపై టాలీవుడ్ స్పందించింది. మొదటిగా విజయ్ దేవరకొండ తన వంతు సాయంగా అమరుల కుటుంబాలకు విరాళం అందించారు. మిగిలిన వారు ముందుకు రావాలని పిలుపునిచ్చాడు. తాను ఎంత మొత్తం సాయం చేశాడన్నది తెలియకుండా.. విరాళానికి సంబంధించిన సర్టిఫికెట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు ఉద్దేశించిన bharatkeveer.gov.in వెబ్ సైట్ కు విరాళాన్ని అందజేశాడు. 
అనంతరం స్పందిస్తూ..‘వారు మన కుటుంబాలను రక్షిస్తున్నారు. మనం ఆ సైనికుల కుటుంబాలకు అండగా నిలవాలి. మన సైనికుల జీవితాలను సాయంతో వెలకట్టలేం. కానీ మనం మనవంతు సహకారం అందించాలి. నావంతు సహకారం నేను అందించా. మనందరం కలిసి సాయం చేద్దాం. మనమంతా కలిసి వారికి మద్దతుగా ఉండే వాతావరణాన్నిసృష్టిద్దాం’ అని ట్వీట్ చేశాడు.
జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో గత గురువారం జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. దీంతో ఉగ్రవాదులపై, వారికి ఊతమిస్తున్న పాకిస్తాన్ కు గట్టిగా బుద్ది చెప్పాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Related posts