telugu navyamedia
ఆరోగ్యం

నాజూగ్గా ఉండాలంటే.. ఇదే దారి.. 

tips to become slim,ayurveda
అందంగా ఉండాలని, అందరి ద్రుష్టి ఆకర్షించాలని ఎవరికి మాత్రం ఉండదు. ఇందులో లింగభేదాల తారతమ్యం లేనప్పటికీ, సహజంగా స్త్రీలు అందానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అది అవసరం కూడా, చివరి వరకు భర్తకు భార్య అందంగా కనిపించాలి.. అది భార్యతో మాత్రమే ముడి పాడేది కాకపోయినా.. ఆమె ప్రయత్నంగా భర్తకు అందంగా కనపడాలని అనుకుంటుంది. వివాహంలో అక్షింతల మంత్రాలూ కూడా అదే చెపుతున్నాయి. అందుకే ఆమె అనేక రకాల ప్రయోగాలు చేస్తుంటుంది. ఇంటి చిట్కాల నుండి ఆమెకు పెద్దలు చెప్పిన అనేకానేక సౌందర్య పోషకాలు వాడుతూ, ఆహారాన్ని కూడా తగ్గట్టుగా తీసుకుంటూ ఉంటుంది.
అయితే నాజూగ్గా ఉండటం అంత సులువు కాదు; ఎత్తుకు తగిన శరీర సౌష్టవాన్ని ప్రతి నిత్యం కలిగి ఉండటం కూడా అందంలో ఒక భాగంగా మహిళలు భావిస్తుంటారు. దాని కోసం కూడా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు. ఎక్కువమంది మహిళలు ఆహారాన్ని తీసుకోవడం మానేస్తుంటారు. ఇది ఎంతమాత్రం సమంజసం కాదంటున్నారు వైద్యులు. నాజూగ్గా ఉండడానికి మోదుగపూలును వాడితే చాలంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
మోదుగ పువ్వులు, గింజలు రెండింటినీ కలిపి ఎండబెట్టాలి. ఆ తర్వాత మెత్తగా దంచి పొడి చేసుకోవాలి. ప్రతిరోజు పావు చెంచా పొడిని చిక్కటి టీలాగా కాచుకుని తాగుతే ఎన్నో లాభాలున్నాయంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ముఖ్యంగా స్త్రీలు నాజూగ్గా, కాంతి వంతంగా తయారవుతారు అంటున్నారు. 
మోదుగ చెట్లు మనకు సహజంగా రోడ్లపక్కన దర్శనమిస్తుంటాయి. ఇవి ఎక్కడైనా పెరుగుతాయి. వీటి గింజలను మోదుగ మాడలు అని అంటారు. మోదుగ గింజలు, మోదుగ పూలు ఈ రెండింటికీ చర్మాన్ని కాంతివంతంగా చేసి, చర్మ రోగాల్ని పోగొట్టే గుణం మాత్రమే కాకుండా, స్థూలకాయాన్ని తగ్గించే శక్తికూడా ఉంటుందని దని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. దీనిని వాడితే మూలవ్యాధులు(పైల్స్), సుఖవ్యాధులు, రక్తదోషాల్నికూడా నివారిస్తుందంటున్నారు వైద్యులు.

Related posts