telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“నన్ను పెళ్ళి చేసుకుంటారా ?”… హీరోయిన్ కు నెటిజన్ ప్రశ్న

Raveena-Randon

కరోనా ఎఫెక్ట్‌ తోలాక్ డౌన్ కొనసాగుతున్న కారణంగా సెలబ్రిటీలందరూ సోషల్ మీడియాకే పరిమితం అయ్యారు. తమ అభిమానులకు జాగ్రత్తగా ఉండమని చెప్తూనే… వారడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు కూడా చెబుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కూడా తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని “ర‌వీనా మేడ‌మ్‌.. వ‌చ్చే జ‌న్మ‌లో న‌న్ను పెళ్లి చేసుకుంటారా?” అని అడిగాడు. ఈ ప్రశ్నకు రవీనా స్పందిస్తూ.. “క్షమించండి.. మరో ఏడు జన్మల వరకు ఖాళీగా లేను” అని సమాధానమిచ్చింది. ఇక ఈ సమయంలో రవీనా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పలు ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.

Related posts