విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతో ఓ గ్రామం మొత్తం విద్యుత్ షాక్ తో వణికిపోయింది. ఊరు మొత్తానికి విద్యుత్ షాక్ రావడంతో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కంసన్‌పల్లి బి గ్రామంలో చోటుచేసుకొంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు.
విద్యుత్ షాక్ కారణంగా గ్రామంలో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయాయి. ప్రభుత్వం విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా ప్రత్యక చర్యలు చేపట్టినప్పటికీ కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో కూడా ఇలాగే జరిగితే విద్యుత్ అధికారుల దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోకపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.