telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్‌ సినిమాలో స్టార్‌ హీరో ?

Prabhas

ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌత్‌తో చేయనున్న ఆదిపురుష్ కూడా ఒకటి. అయితే ప్రస్తుతం ప్రభాస్ వేరే సినిమాతో బిజీగా ఉండటంతో ప్రభాస్ లేకుండానే ఓంరౌత్ ఆదిపురుష్‌ను మొదలు చేయనున్నాడు. దీనికి సంబంధించిన చిత్రీకరణ పనులను కూడా మొదలుపెట్టేశాడు. ప్రభాస్ లేనటువంటి సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఇందులో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్న బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పాల్గొననున్నాడు. దీంతో అతి త్వరలో ఆదిపురుష్ చిత్రీకరణను ప్రారంభించనుంది. అయితే ప్రభాస్ చేస్తున్న ఆదిపురుష్ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడని, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రను పోషించనున్నాడు. అయితే.. తాజాగా మరో అప్డేట్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమాలో మరో స్టార్ హీరోగా కూడా కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. అతడెవరో కాదండీ బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అజయ్ దేవగన్. అజయ్ ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్‌ సినిమాలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అదే విధంగా ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో చేయనున్నారంట. ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాల్సిందే. ఇదిటా ఉంటే ఆదిపరుష్ సినిమాను ప్రధానంగా తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారంట, ఆ తరువాత ఈ సినిమాను ఇతర భాషలు తమిళ్, కన్నడ, మలయాళం, విదేశీ భాషల్లోకి అనువదిస్తారని అంటున్నారు. అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Related posts