హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా గద్దలకొండ గణేష్. మొదట ఈ సినిమాకు వాల్మీకి అనే టైటిల్ పెట్టినప్పటికీ ఈ టైటిల్ పట్ల కొంతమంది ప్రజల నుండి వ్యతిరేఖత రావటం, వాల్మీకి టైటిల్ తో సినిమా విడుదల చేయటానికి అనంతపురం, కర్నూలు జిల్లా కలెక్టర్లు అభ్యంతరం చెప్పటంతో ఈ సినిమా టైటిల్ ను నిన్న సాయంత్రం గద్దలకొండ గణేష్ గా మార్చారు. ఈ సినిమా ఫస్టాఫ్ యావరేజ్ గా ఉండగా సెకండాఫ్ బాగుంది. గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ తేజ్ అద్భుతంగా నటించాడు. తమిళ నటుడు అథర్వ రియల్ గ్యాంగ్ స్టర్ మీద సినిమా తీసే డైరక్టర్ పాత్రలో నటించాడు. అథర్వ స్నేహితుని పాత్రలో కమెడియన్ సత్య నటించాడు. సినిమా సెకండాఫ్ లో ప్లాష్ బ్యాక్ లో పూజా హెగ్డే పాత్ర ఎంట్రీ ఇస్తుంది. సెకండాఫ్ లో వరుణ్, పూజా హెగ్డే మధ్య వచ్చే ఎల్లువొచ్చే గోదారమ్మ పాటను అద్భుతంగా చిత్రీకరించారు.
తన పాత్రకు వరుణ్ నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. పూజా హెగ్డే పాత్ర ఉన్నది కేవలం కొంత సమయం మాత్రమే అయినప్పటికీ పూజ అద్భుతంగా నటించింది. తమిళ నటుడు అథర్వ మురళి, మృణాళిని వారి వారి పాత్రల్లో అద్భుతంగా నటించారు. సినిమాలోని కామెడీ సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. కమెడియన్ సత్య, బ్రహ్మాజీ కామెడీ సీన్స్ బాగున్నాయి. సెకండాఫ్ బాగానే ఉన్నప్పటికీ ఫస్టాఫ్ విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. ఫస్టాఫ్ లో కథనం స్లోగా సాగుతుంది. నేపథ్య సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాన్ని బాగా చిత్రీకరించారు. ఫైనల్ గా వరుణ్ తేజ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమా హిట్ అని చెప్పవచ్చు. మాస్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా అమితంగా నచ్చుతుందని చెప్పవచ్చు.