telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిత్ర పరిశ్రమలో మరో విషాదం..ప్రముఖ నటుడు మృతి

2020 సంవత్సరం చిత్ర పరిశ్రమను కుదిపేసిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్ట పోగా.. ప్రముఖ నటులు 2020లోనే మృతి చెందారు. తాజాగా సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది.  తాజాగా మలయాళ నటుడు, సినీ రచయిత పి. బాలచంద్రన్‌ (69) మృతి చెందారు. గత ఎనిమిది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన.. సోమవారం ఉదయం మృతి చెందారు. ఆయనకు భార్య శ్రీలత, కుమార్తె కుమారుడు ఉన్నారు. 1991 లో మోహన్‌లాల్‌ హీరోగా నటించిన “అంకుల్‌ బన్‌” అనే సినిమాతో ఆయన స్క్రీన్‌ రైటర్‌గా వెండితెరకు ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాతో మంచి గుర్తింపు పొందిన ఆయన ఆ తర్వాత పలు చిత్రాలకు స్క్రీన్‌ రైటర్‌గా కథ, మాటలు అందించారు. బాలచంద్రన్‌ చివరిసారిగా ఈ ఏడాది ప్రారంభంలో మమ్ముట్టి సినిమా థ్రిల్లర్‌ వన్‌లో కనిపించారు. బాలచంద్రన్‌ మృతికి పరిశ్రమ సంతాపం తెలిపింది. 

Related posts