telugu navyamedia
తెలంగాణ వార్తలు

ప్ర‌యాణికుల‌కు షాక్ : మ‌రోసారి తెలంగాణ ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు..

తెలంగాణ ప్ర‌యాణికుల‌కు మ‌రోసారి భారం ప‌డ‌నుంది. ఓ వైపు నిత్య‌వ‌స‌ర ధ‌ర‌లు మండిపోతున్నాయి. మ‌రోవైపు డీజీల్‌, పెట్రోల్‌, ఎల్పీజీ ధ‌ర‌లు కూడా వ‌రుస‌గా షాకిస్తున్నాయి. ఇప్ప‌టికే రెండు సార్లు ఛార్జీలు పెంచిన తెలంగాణ ఆర్టీసీ మ‌రోసారి పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

డీజిల్ సెస్ పేరుతో మ‌రోసారి ప్రయాణికులపై భారీ భారాన్ని మోపింది. కిలో మీటరు లెక్కన దాదాపు అన్ని రకాల బస్సుల్లో ఛార్జీలు పెరగనున్నాయి. ఆర్టీసీ బ‌స్సుల్లో అద‌న‌పు డీజిల్ సెస్‌ను ఇవాళ్టి నుంచి వ‌సూలు చేయ‌నున్నారు.

గత మార్చిలోనే డీజీల్ సెస్ పేరుతో దాదాపు రూ.2 నుంచి రూ.5 వరకూ ధర పెంచారు. ఇప్పుడు కిలో మీటర్ల ప్రాతిపదికన డీజిల్ సెస్ ను పెంచుతున్నారు. ఈ పెంపుతో సగటున ఒక్కో ప్యాసింజర్ పైన రూ.20 వరకూ భారం పడనుంది.

కాగా.., హైదరాబాద్ లో మాత్రం సిటీ బస్సులకు దీన్ని ప్రస్తుతానికి మినహాయించారు. ఈ పెంపు ఇప్పటికే నేటి నుంచి అమల్లోకి వచ్చింది.

ఏ బస్సుల్లో ఎంతెంత పెంచారు..

*పల్లె వెలుగు బస్సులో 250 కిలో మీటర్లకు కనిష్ఠంగా రూ.5, గరిష్ఠంగా రూ.45 పెరిగింది
*ఏసీ బస్సుల్లో 500 కిలో మీటర్ల దూరానికి రూ.10 నుంచి రూ.170 పెరుగుదల
*సూపర్‌ లగ్జరీ బస్సుల్లో 500 కి.మీ. దూరానికి కనిష్ఠంగా రూ. 10 నుంచి గరిష్ఠంగా రూ. 130 పెంచారు.
*ఎక్స్ ప్రెస్ బస్సులో 500 కిలో మీటర్ల పరిధిలో కనిష్ఠంగా రూ.5 నుంచి రూ.90 పెరుగుదల

Related posts