telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

షాకింగ్ : గోరేటి వెంకన్న, సారయ్య, దయానందకు నోటీసులు..

గోరేటి వెంకన్న, సారయ్య, దయానంద్ లను MLC గా గవర్నర్ కోటా లో నియమించడం ను ఛాలెంజ్ చేస్తూ వేసిన రిట్ ఆఫ్ కో వారంటో కేసులో ఈ రోజు తెలంగాణ హై కోర్ట్ ప్రతివాదులకు నోటీస్ లు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ b.s. ప్రసాద్ ను నోటీస్ లు తీసుకోవాలని చీఫ్ జస్టిస్ బెంచ్ ఆదేశించింది. గవర్నర్, అలహాబాద్ హై కోర్ట్ తీర్పుకు వ్యతిరేకంగా, మంత్రివర్గ ఆదేశానుసారం ఈ ముగ్గురిని MLC లు గా నియమించడం ను పిటిషనర్ ధన గోపాల్ హై కోర్ట్ లో ఛాలెంజ్ చేశాడు. రాజ్యాంగం లోని ఆర్టికల్ 171(3)(ఇ), 5 ప్రకారం గవర్నర్ తన విచక్షణతో రాష్ట్ర శాసన మండలి లో 1/6 వంతు సభ్యులను నియమించాలి. అయితే ఈ సభ్యులు వివిధ రంగాలలో నిష్ణాతులు అయ్యి ఉండాలి. పిటిషనర్ ధన గోపాల్ తనను, సామాజిక సేవ రంగం నుండి MLC గా నియమించాలని కోరగా, గవర్నర్ అందుకు సమ్మతించి, రెండు సార్లు పిటిషనర్ పేరును రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. గాని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆదేశాలను బెకతరు చేస్తూ, ఈ ముగ్గురి పేర్లను ప్రతిపాదించింది. గవర్నర్, అలహా బాదు హై కోర్ట్ ఏర్పరిచిన పద్దతి ప్రకారం గా కాకుండా రాష్ట్ర మంత్రి వర్గ సిఫారసులను ఆమోదించడం ను పిటిషనర్ జీర్ణించుకోలేక, గవర్నర్ నిర్ణయాన్ని తప్పు పడుతూ హై కోర్ట్ ను ఆశ్రయించాడు. R.s చౌహాన్ మరియు బి. విజయ సేన్ రెడ్డి ధర్మాసనం నోటీసులు జారీ చేస్తూ నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతి వాదులను ఆదేశించారు.

Related posts