telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

బూట్లు వేసుకోలేదని చితకబాదిన టీచర్లు.. విద్యార్థికి తీవ్రగాయాలు!

teacher attack

పాఠశాలకు బూట్లు వేసుకురావడం లేదని ఓ పదో తరగతి విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు ఇద్దరు చితకబాదారు. చిన్నతప్పుకు పెద్ద శిక్ష వేయడంతో వివాదాస్పదమైంది. టీచర్ల తీరుపై బాధిత తండ్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో రామచంద్రపురానికి చెందిన అబ్దుల్ రజాక్ పదో తరగతి చదువుతున్నాడు. బూట్లు వేసుకోవడం లేదని, ఇంటికి ఆలస్యంగా వెళ్తున్నాడని తెలుగు, ఇంగ్లీష్ టీచర్లు రజాకను చితకబాదారు. దీంతో అతని చెయ్యి, వీపు, దవడపై తీవ్రగాయాలయ్యాయి.

ఈ ఘటన పై బాధిత విద్యార్థి తండ్రి రఫీ పాఠశాల నిర్వాహకులను ప్రశ్నిస్తే వారి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో ఆగ్రహించిన అతను విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎంఇఓ రాథోడ్ నిన్న పాఠశాలలో విచారణ నిర్వహించారు. విద్యార్థులను కొట్టడం తీవ్ర నేరమని బాధ్యులైన ఉపాధ్యాయులను మందలించారు. ఈ వివాదంపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నట్టు తెలిపారు.

Related posts