telugu navyamedia
రాజకీయ

కాంగ్రెస్ పార్టీకి తాను ఒక సేవకుడినని..- సీఎం చన్నీ

పంజాబ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీలు దూసుకెళ్తున్నాయి .పంజాబ్‌లో ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఈ క్ర‌మంలో సీఎం చన్నీ ఓ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు చ‌ర్చానీయాంశంగా మారాయి. కాంగ్రెస్​ పార్టీకి తాను ఒక సేవకుడినని.. అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న దాన్ని గౌరవిస్తానని సీఎం చన్నీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ‘త్వరలో జరగనున్న ఎన్నికలలో కాంగ్రెస్​ అధిష్టానం పంజాబ్​ సీఎం అభ్యర్థిగా.. రాష్ట్ర కాంగ్రెస్​ చీఫ్​ నవజ్యోత్​ సింగ్ సిద్ధూని పేరుని యోచిస్తుందా ’ అని ప్రశ్నించ‌గా… సిద్ధూ తనకు సోదరుడు లాంటి వాడని, దీనిపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు.

అంతేకాకుండా ..ఇటీవల ఆమ్​ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్​ అరవింద్​ కేజ్రీవాల్​ పంజాబ్​ సీఎం​ అభ్యర్థిగా భగవంత్​మాన్​ పేరును ప్రకటించడంపై కూడా స్పందించారు. కేజ్రీవాల్​ పంజాబ్​ నుంచి నాయకుడిగా ఎదగాలన్నారు. పంజాబ్​ ప్రజల నుంచి తగినంత మద్దతు కనబడకపోవడంతో చివరి నిమిషంలో భగవంత్​ మాన్​​ పేరును ప్రతిపాదించారని తెలిపారు.

తన మేనల్లుడిపై ఐటీ దాడులుకు సంబంధించి మాట్లాడుతూ.. ఇతరులపై దాడి జరిగితే.. తన నిజాయితీని శంకించడం సరికాదు అని చన్నీ అన్నారు. ఇప్పటికే కేజ్రీవాల్ తన పరిధి దాటి పోయారని చెప్పారు. పరువు నష్టం దావా వేస్తాన‌ని, దీనికి సంబంధించి.. పార్టీని అనుమతి కోరానని చెప్పారు. తన విషయంలోనే కాదు ఇతరుల విషయంలోనూ కేజ్రీవాల్ కూడా అలానే వ్యవహ‌రించారని తెలిపారు

కాగా..తాను పోటికి దిగుతున్న చామ్​​కౌర్​ సాహిబ్​ స్థానం నుంచి ఓడిపోతారని నిన్న కేజ్రీవాల్ చన్నీపై విమర్శలు చేశారు. ఐటీ దాడులలో కోట్లాది రూపాయలు వెలుగు చూశాయని.. ఈ సొమ్ము ఎక్కడిది అని ఆయన అడిగారు.

 

Related posts