telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఆసక్తి రేపుతున్న కేంద్ర కేబినెట్ భేటీ మీటింగ్..

Modi Mask

కేసులు పెరుగుతున్న సమయంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో పాక్షిక లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు.  కొన్ని రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు.  దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాలి అంటే ఖచ్చితంగా లాక్ డౌన్ అమలు చేయాలని లేకుంటే కేసులు, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు, కోర్టులు హెచ్చరిస్తున్నాయి.  లాక్ డౌన్ విధిస్తే దేశం ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నది.  గతేడాది విధించిన లాక్ డౌన్ కారణంగా ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి దేశం ఇంకా బయటపడలేదు.  ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరిగి లాక్ డౌన్ విధిస్తే పరిస్థితులు మరింత దారుణంగా మారుతాయని కేంద్రం చెప్తున్నది.  లాక్ డౌన్ విధించకుంటే కేసులు పెరిగి, ప్రజారోగ్యం దెబ్బతిని ఆర్ధికంగా కుంగిపోవాల్సి వస్తుంది.  ఫలితంగా దేశంపై ఆర్ధిక భారం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో జరుగుతున్న కేబినెట్ భేటీ కావడంతో దీనిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.

Related posts