telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

బెంగాల్ డాక్టర్ల సమ్మె : .. వెనక్కి తగ్గిన మమతా.. డిమాండ్లు ఒప్పుకుంటూ ..

mamata accepted to doctors demands

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డాక్టర్ల డిమాండ్లపై సానుకూలంగా ఉన్నామని అన్నారు. సమ్మె కారణంగా వేల మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సమ్మె విరమించాలని డాక్టర్లకు మమత విజ్ణప్తి చేశారు. భద్రతపై డాక్టర్లకు పూర్తి భరోసా ఇస్తామని ఆమె తెలిపారు. డాక్టర్లపై దాడి చేసినవారిని అరెస్ట్ చేస్తామన్నారు. డాక్టర్ల డెలిగేషన్ ను కలిసేందుకు మంత్రులు,ప్రిన్సిపల్ సెక్రటరీని పంపిచానని, నిన్న,ఇవాళ డాక్టర్ల డెలిగేషన్ ను కలిసుందుకు 5గంటలు ఎదురుచూసినా కూడా వాళ్లు మంత్రులను కలవలేదని,డాక్టర్లు ప్రభుత్వానికి సహకరించడం లేదని మమత అన్నారు.తాము ఒక్క డాక్టర్ ని కూడా అరెస్ట్ చేయలేదని, ఏ విధమైన పోలీస్ చర్య తీసుకోబోమని ఆమె తెలిపారు. రాష్ట్రంలో ESMA(ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్) చట్టాన్ని విధించాలనుకోవడం లేదన్నారు.

జూన్-10,2019న జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. ఆ ఘటనలో గాయపడి ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న జూనియర్ డాక్టర్ మెడికల్ ట్రీట్మెంట్ ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆమె తెలిపారు. ఇటీవల కోల్‌ కతాలోని ఎన్‌ఆర్ఎస్ హాస్పిటల్ లో ఒక పేషెంట్ కుటుంబసభ్యులు ఇద్దరు డాక్టర్లపై తీవ్రంగా దాడిచేసి గాయపర్చిన విషయం తెలిసిందే. ఆ దాడిని ఖండిస్తూ అక్కడ కొన్ని రోజులుగా డాక్టర్లు సమ్మె చేస్తున్నారు.పశ్చిమబెంగాల్‌ లో డాక్టర్లు ఆందోళనకు దిగడం, వారికి వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ డాక్టర్లు సంఘీభావం తెలుపుతున్న సమయంలో స్పందించిన మమత డాక్టర్ల డిమాండ్లు పరిష్కరిస్తామని తెలిపారు.

Related posts