telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

పిసిసి నియామకంపై శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు…

పిసిసి అనేది ఏఐసీసీ పరిధిలోని అంశమని.. నేను పిసిసి రేసులో లేనని పేర్కొన్నారు కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి శ్రీధర్ బాబు. పిసిసి నియామకంపై మాట్లాడుతూ… తనకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు.. ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. పిసిసి ఎవరికి ఇవ్వాలన్నది ఏఐసీసీకి తెలుసు అని తెలిపారు. అంతకు ముందు భూముల అమ్మకంపై కెసిఆర్ సర్కార్ పై శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. ప్రజల సంపదని..ప్రభుత్వం అమ్మాలని చూస్తుందని.. 30 వేల ఎకరాలను అమ్ముకోవాలని వేలం వేస్తుందన్నారు. భూముల అమ్మకం ఉప సంహరించుకోవాలని..తెలంగాణ ఇచ్చింది భూములు అమ్ముకోవాలని ఇవ్వలేదని మండిపడ్డారు. సంపద తెలంగాణకు దక్కాలని సోనియా రాష్ట్రం ఇచ్చింది.. మిగులు రాష్ట్రం ఇస్తే.. అప్పుల తెలంగాణగా మార్చేసిందని టీఆర్ఎస్ అని మండిపడ్డారు.

Related posts