విమానాల నిషేధం పూర్తయ్యేవరకూ స్వదేశానికి అనుమతించబోమని ఆ దేశ క్రికెటర్లకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్పష్టం చేసింది. నిషేధం ముగిసేవరకూ భారత్‌లోనే ఉండాలని క్రికెటర్లకు తెలిపింది. ప్లేయర్ల కోసం ప్రత్యేక అనుమతులు లేవని, ప్రభుత్వం కఠిన నిబంధనలను మే 15 వరకూ అమలు చేయనున్నట్లు సీఏ స్పష్టం చేసింది. అప్పటివరకూ క్రికెటర్లను దేశంలోకి అనుమతించబోమని సీఏ తెలిపింది. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ మాట్లాడుతూ… ‘నిషేధం అమల్లో ఉన్న సమయంలో భారత్ నుంచి వచ్చే ఎవరికైనా జరిమానా లేదా జైలు అనేది ఒకే రకంగా ఉంటుంది. ఇక్కడ ఆస్ట్రేలియన్లకు కూడా ఇదే వర్తిస్తుంది’ అని అన్నారు. ఇక ఆసీస్ ప్రధాని విమానాల నిషేధాన్ని సమర్ధించుకున్నారు. ఇక తమ దేశ మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్ చేసిన ‘బ్లడ్ ఆన్ యువర్ హ్యాండ్స్’ వ్యాఖ్యలపై మోరిసన్ స్పందిస్తూ.. అది అర్థం లేని వ్యాఖ్య అని కొట్టిపారేశారు. ఆస్ట్రేలియా క్రికెటర్లను స్వదేశానికి తీసుకురావడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక విమానాలు వేయమని, మీరే సొంత ఖర్చులు పెట్టుకుని రావాలని పీఎం స్కాట్ మోరిసన్ కొన్ని రోజుల క్రితమే స్పష్టం చేశారు.
previous post