telugu navyamedia
తెలంగాణ వార్తలు

అవ‌కాశ‌మిస్తే..మోదీ తెలంగాణ‌ను అమ్మేస్తాడు..

*కేంద్రంలో బీజీపీ కి ఓటేసి తప్పు చేశామన్నారు..
*తెలంగాణలో బీజేపీకి అధికారం ఇస్తే.. తెలంగాణను మళ్లీ ఏపీలో కలిపేస్తారు..

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ బుధవారం నాడు బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బాన్సువాడ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..తెలంగాణ పుట్టుకను ప్రశ్నించిన బీజేపీకి తెలంగాణలో పుట్టగతులు ఉండాలా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రంలో బీజీపీ కి ఓటేసి తప్పు చేశామన్నారు.

గిరిజన యూనివర్సిటీ కావాలని అడిగితే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ప్రధాని మోదీ నెరవేర్చలేదన్నారు. ఉపాధి హామీకి 25 శాతం నిధులు తగ్గించారని ఆరోపించారు. జీవితాలు మార్చమంటే జీవిత బీమాను మోదీ అమ్మేశారని ఎద్దేవా చేశారు.

అవ‌కాశ‌మిస్తే..తెలంగాణ‌ను మోదీ అమ్మేస్తాడ‌ని అమ్మేస్తాడని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ దేశం కోసం, ధర్మం కోసం అంటూ డైలాగులు చెప్పడం తప్ప చేసిందేమీ లేదన్నారు.

పక్కనే ఉన్న కర్ణాటకకు జాతీయ ప్రాజెక్టు ఇచ్చిన మోదీ.. తెలంగాణలో కాళేశ్వరం, పాలమూరుకు అడిగితే ఇవ్వలేదు. గిరిజన రిజర్వేషన్లు పెంచమంటే నాలుగేళ్లయినా దున్నపోతు మీద వాన పడ్డ చందంగా ఉంది. ఏం అడిగినా ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదు. మోదీకి యూపీకి మాత్రమే ప్రధాని అని కేటీఆర్ విమర్శించారు..కొందరు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పరోక్షంగా బీజేపీపై ఆయన విమర్శలు చేశారు.

మోదీ ప్రధానిగా అధికారం చేపట్టి ఏడేళ్లు దాటుతున్నా తెలంగాణకు ఎలాంటి ప్రాజెక్టులు మంజూరు చేయలేదన్నారు.బీజేపీ నేతలు విషం చిమ్మకుండా విషయాలు మాట్లాడితే బాగుంటుందని మంత్రి కేటీఆర్ హితవు పలికారు.

Related posts