telugu navyamedia
సినిమా వార్తలు

జూబ్లీహీల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసుపై ఆర్జీవీ ట్వీట్‌..

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్‌రేప్‌ ఘటన పై వివాద‌స్ప‌ద‌ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ త‌న‌దైన శైలీలో స్పందించారు. ఈ విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు మ‌ద్ద‌తు ప‌లికారు. 

ఘటనకు సంబంధించినంత వరకు ఒక సామాన్యునిగా ఆలోచిస్తే.. బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే రఘునందన్ రావు మాత్రమే నిజాయితీగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తోందని పేర్కొన్నారు.

ఆయన తప్ప.. మిగతా వారు కేసును పక్కదారి పట్టిస్తున్నార‌నిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇలాంటి ఘటనల్లో తప్పుదారి పట్టించేలా మాట్లాడటం బాధాకరమని తనదైన శైలిలో పేర్కొన్నారు.

Related posts