యంగ్ హీరో కార్తికేయ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా కార్తికేయ నటిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించి అధికారికంగా వివరాలు వెల్లడించారు. కార్తికేయ హీరోగా నూతన దర్శకుడు శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో తాన్యా రవిచంద్రన్ కథానాయికగా నటించనున్నారు. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై 88 రామారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నేడు కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా విశేషాలను వెల్లడించారు. శ్రీ సరిపల్లి, 88 రామారెడ్డి మాట్లాడుతూ “ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. ఇందులో కార్తికేయ ఎన్‌ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ఆఫీసర్‌గా కనిపిస్తారు. కథ వినగానే నటించేందుకు ఒప్పుకున్నారాయన” అని అన్నారు. సాయి కుమార్, తనికెళ్ల భరణి, సుధాకర్ కోమాకుల, పశుపతి కీలక పాత్రల్లో నటించనున్న ఈ చిత్రానికి సంగీతం ప్రశాంత్ ఆర్.విహారి అందిస్తున్నారు.
previous post