సీఎం జగన్ మధ్యాహ్న భోజన పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి అక్షయపాత్ర ట్రస్ట్ ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరైనారు. ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మకమైన మార్పులు తేవాలి. ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు.. మొగ్గుచూపేలా పాఠశాలల్ని తీర్చిదిద్దాలి.
స్కూళ్లలో మౌలిక సదుపాయాలు వెంటనే ఏర్పాటు చేయాలి. మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీపడొద్దు. సౌకర్యవంతమైన వంటశాలలు నిర్మించాలి. ఇది ప్రాథమిక సమావేశం, తర్వాత సమావేశం నాటికి.. పూర్తిస్థాయి ప్రణాళికలతో రావాలి.. అని జగన్ ఆదేశించారు.
పోలవరం పై హైకోర్టు తీర్పు జగన్కు చెంపపెట్టు: దేవినేని