telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఫోర్బ్స్ టాప్-10 సెలబ్రిటీలు… స్టార్స్ ను వెనక్కి నెట్టేసిన కోహ్లీ

Virat

ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ-100 జాబితాలో అత్యధికంగా ఆర్జిస్తోన్న భారత సెలబ్రిటీల జాబితాను అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా తాజాగా విడుదల చేసింది. ఈ లిస్టులో క్రీడా విభాగం నుంచి క్రికెటర్లే ఎక్కువగా ఉండ‌టం విశేషం. భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీ, సచిన్ టెండూల్కర్ టాప్-10లో చోటు దక్కించుకున్నారు. అయితే గ‌త ఏడాది టాప్ 2లో నిలిచిన భార‌త క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి స్థానాన్ని సంపాదించి అంద‌రికి షాక్ ఇచ్చాడు. అక్టోబ‌ర్ 1, 2018 నుండి సెప్టెంబ‌ర్ 30, 2019 మ‌ధ్య సెల‌బ్రిటీలు ఆర్జించిన ఆదాయంతో ఫోర్బ్స్ ర్యాంకులు ప్ర‌క‌టించ‌గా విరాట్ కోహ్లీ 252.72 కోట్లు ఆర్జించాడు. దీంతో ఈ ఏడాది ఎక్కువ‌గా ఆదాయాన్ని పొందిన వారిలో విరాట్ టాప్ స్థానంలో ఉన్నాడు. ఆయ‌న త‌ర్వాతి స్థానాల‌లో అక్ష‌య్ కుమార్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బ‌చ్చ‌న్‌, మ‌హేంద్ర సింగ్ ధోని , షారూఖ్ ఖాన్, ర‌ణ్‌వీర్ సింగ్‌, అలియా భ‌ట్, సచిన్, దీపికాలు టాప్ 10లో నిలిచారు. తెలుగులో ప్రభాస్ 44వ స్థానాన్ని ద‌క్కించుకోగా, మ‌హేష్ బాబు 54వ స్థానంతో స‌రిపెట్టుకున్నాడు. ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ 77వ స్థానంలో నిలిచారు

ఫోర్బ్స్ టాప్ సెలబ్రిటీలు :
1.విరాట్ కోహ్లీ(రూ.252.72కోట్లు)
2. అక్షయ్ కుమార్ (రూ.293.25కోట్లు)
3.స‌ల్మాన్ ఖాన్ ( రూ. 229.25 కోట్లు)
4.అమితాబ్ బ‌చ్చ‌న్ ( రూ. 239.25 కోట్లు)
5.ఎంఎస్ ధోని ( రూ. 135.93 కోట్లు)
6.షారూఖ్ ఖాన్ ( రూ. 124.38 కోట్లు)
7.ర‌ణ్‌వీర్ సింగ్ ( రూ. 118.2 కోట్లు)
8. అలియ భ‌ట్ ( రూ. 59.21 కోట్లు)
9. స‌చిన్ టెండూల్క‌ర్ (రూ. 76.96 కోట్లు)
10. దీపికా ప‌దుకొణే( రూ. 48 కోట్లు)
13. ర‌జనీకాంత్ (రూ. 13 కోట్లు)
27. మోహన్ లాల్ (రూ. 64.5 కోట్లు)
44. ప్ర‌భాస్ (రూ. 35 కోట్లు)
47. విజ‌య్ (రూ. 30 కోట్లు)
54. మ‌హేష్ బాబు (రూ. 35 కోట్లు)
56. క‌మ‌ల్ హాస‌న్ (రూ. 34 కోట్లు)

Related posts