telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మేడారం జాతర విశేషాలు అమితాబ్ నోట…!

Amitab

తెలంగాణ కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మల మహా జాతర ఫిబ్రవరి 5న ప్రారంభం కానుందన్న విషయం తెలిసిందే. అయితే మేడారం జాత‌ర కోసం ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేయ‌డంతో పాటు జాత‌ర విశేషాల‌ని ప్ర‌తి ఒక్క‌రికి తెలిపేందుకు ప్ర‌త్యేక వీడియో రూపొందించింది. తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ భాష‌లలో రూపొందిన ఈ వీడియోని రూపొందించగా ఇంగ్లీష్‌, హిందీ భాష‌ల వీడియోకి బాలీవుడ్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ గాత్రాన్ని అందించారు. జాత‌ర విశేషాల‌ని జాతీయ‌, అంతార్జాతీయ స్థాయికి తీసుకెళ్ళేందుకు ఇలా వీడియోని రూపొందించిన‌ట్టు మంత్రి స‌త్య‌వ‌తి రాఠోడ్ తెలిపారు. మేడారం జాతర పర్యాటకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ కూడా క‌ల్పిస్తుంది. సమ్మక్క-సారలమ్మ దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రత్యేక ప్యాకేజీలను ఏర్పాటు చేసి అమ్మల దర్శనంతో పాటు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంది. జాతరలో భాగంగా చిలుకలగుట్టపైనున్న సమ్మక్కను ఫిబ్రవరి 6న సాయంత్రం గద్దెపై ప్రతిష్ఠాపన చేస్తారు. ఫిబ్రవరి 7న సమ్మక్క–సారలమ్మలతో పాటు పగిడిద్ద రాజులు, గోవిందరాజును గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ఫిబ్రవరి 8న అమ్మవార్ల తిరుగు ప్రయాణంగా వన ప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది.

Related posts