telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

“అమ్మ మనసు “

అనువంత రూపంతో అమ్మని చేరావు
అంచెలంచెలుగ రూపాన్ని సంతరించుకొని
పిండంగా మారి తొమ్మిదినెలలకు
పురిటినొప్పులతో పురుడుపోసుకొని
పసికందువై లోకాన్ని చేరావు
మహరాజులా ఊయలూగి యువరాజులా పెరిగి
కన్నతల్లి మమకారాన్ని సహకారాన్ని తీసుకొని
పెరిగి పెద్దై గడ్డాలు మీసాలు రాగానే
అమ్మ నీ కంటికి అనువంత ఐయ్యింది అనాధగ మారింది
వృద్దాశ్రమాన్ని చేరింది అయినా అమ్మ కదా
తన ఆకలి మరిచి నీ ఆకలికై ఎదురు చూసింది
గోరుముద్దలు తినిపించాలని అదేకదా అమ్మంటే
నీకు తెలిసిన జ్ఞానం ఆ పిచ్చితల్లికి లేదురా నాన
రేపు నీకు నా వయసు రాకమానదురా నాన నీకో కొడుకు ఉన్నాడుగా

Related posts