telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ప్రేయసితో బెడ్రూమ్ లో ప్రియుడు… తొంగి చూసిన వ్యక్తి… చివరకు ఇలా ?

Naked

అమెరికాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తను ప్రేయసితో బెడ్రూంలో ఉండగా.. కిటికీలోంచి తొంగిచూస్తున్న ఓ దుండగుడిని విక్టర్ విక్కరీ(30) అనే వ్యక్తి కొట్టి చంపేశాడు. ఫ్లోరిడాకు చెందిన విక్టర్.. ఫోర్ట్ లాడర్డేల్‌లోని తన ఇంట్లో ప్రియురాలికి దగ్గరవబోతుండగా, కిటికీ వద్ద ఏదో చప్పుడయింది. ఆ శబ్దం విన్న విక్టర్ వెంటనే నగ్నంగానే బయటకు పరిగెత్తుకొచ్చాడు. దాంతో ఆ కిటికీ వద్ద ఉన్న అసాద్ అకర్ (57) కనిపించాడు. ప్రేమికులిద్దరూ లైంగిక చర్యల్లో పాల్గొంటుంటే తొంగి చూస్తున్న అసాద్‌పై విక్టర్‌కు కోపం కట్టలుతెంచుకుంది. దీంతో వీరిద్దరూ ముష్టియుద్ధానికి దిగారు. ఈ సమయంలో విక్టర్ ప్రేయసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. వారు వచ్చేసరికి అసాద్ మృతిచెందాడు. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు.. అసాద్ గతంలో కూడా చాలామంది ఇళ్లలోకి అలానే చూసినట్లు కేసులు నమోదయినట్లు వెల్లడించారు. విక్టర్‌పై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts