telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణాలో భారీగా తగ్గిన కేసులు..

corona vaccine covid-19

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే…ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 661 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఇక 24 గంటల్లో ముగ్గురు కరోనా తో మృతిచెందారు. దీంతో..కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,57,374 కి చేరుకుంది. ఇక ఇప్పటి వరకు కరోనాబారినపడి 2,40,545 మంది కోలుకున్నారు. తాజా మరణాలతో తెలంగాణ రాష్త్రంలో మొత్తం 1404 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.54 శాతానికి పడిపోయిందని.. రికవరీ రేటు దేశంలో 93.01 శాతంగా ఉంటే.. స్టేట్‌లో 93.46 శాతానికి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక, ప్రస్తుతం 15,425 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 21,264 కరోనా పరీక్షలు నిర్వహించగా..మొత్తం టెస్టుల సంఖ్య 48,74,433 కు చేరుకుంది.

Related posts