telugu navyamedia
సినిమా వార్తలు

ఆచార్య‌లో చ‌ర‌ణ్ పాత్ర పై క్లార‌టీ వ‌చ్చేసింది..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన‌ మూవీ ‘ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న‌ ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. రామ‌చ‌ర‌ణ్ ‘సిద్ధ’ అనే పాత్రలో చరణ్‌ సందడి చేయనున్నాడు. ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్, చరణ్ సరసన పూజా హెగ్డే సందడి చేయనున్నారు.

Acharya Poster: Chiranjeevi and Ram Charan Start Shooting for the Final  Schedule of the Film | 🎥 LatestLY

ఈ సినిమా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. కాగా ‘ఆచార్య’ సినిమాలో చరణ్‌ ఎంతసేపు ఉంటాడనేది ఆసక్తికరంగా మారింది. సోషల్‌ మీడియాలోనూ దీనికి సంబంధించి దీనికి సంబంధించి పలు రకాల వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Chiranjeevi and Ram Charan's Acharya shoot is almost done, just two songs  to go - Movies News

అయితే, తాజా సమాచారం ప్రకారం చరణ్ పాత్ర నిడివి 40 నిమిషాలవరకు ఉంటుందట. ఇంట్రవెల్ బ్యాంగ్ పడేముందు చరణ్ పాత్ర ఎంట్రీ ఉంటుందని, సెకండాఫ్‌లో 40 నిమిషాలకు పైగానే ఉండబోతుందని తెలుస్తోంది.

Ram Charan introduces his leading lady Pooja Hegde in Chiranjeevi starrer  'Acharya'

ఇందులో చిరు – చరణ్‌ల కాంబినేషన్ సీన్స్ గూస్‌బంస్ వచ్చేలా ఉంటాయని ఇప్పటికే చిత్ర దర్శకుడు కొరటాల శివ చెప్పుకొచ్చారు. ఆ విషయం ఇటీవల వచ్చిన సిద్ద పాత్రకు సంబంధించిన టీజర్‌లోనూ అర్థమైంది.

Koratala Siva to take retirement Koratala Siva to take retirement

కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి ‘ఆచార్య’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకన్న ఈ సినిమా 2022, ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Related posts