తమిళనాడు మాజీ సీఎం, స్వర్గీయ జయలలిత జీవితం ఆధారంగా ‘క్వీన్’ పేరిట వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఈ వెబ్ సిరీస్‌ను దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ తెరకెక్కిస్తున్నారు. జయలలిత రాజకీయ జీవితానికి సంబంధించిన పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేశారు. జయలలిత విద్యార్థి దశ నుంచి సినీ, రాజకీయ జీవితం వరకూ జరిగిన సంఘటనలను ఈ ట్రైలర్‌లో జోడించారు. ఇందులోని సన్నివేశాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ ట్రైలర్ ట్రెండ్ అవుతోంది. జయలలిత విద్యార్థి, సినీ జీవితానికి సంబంధించి మరో ఇద్దరు నటులను ఆ పాత్రల్లో చూపించారు. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన అన్ని ఎపిసోడ్‌లను చిత్రయూనిట్ డిసెంబర్ 14 నుంచి ‘ఎంఎక్స్ ప్లేయర్’ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారు.
previous post
next post
“వెంకీమామ”లో రకుల్ పాత్రను కొట్టేసిన రాశిఖన్నా