telugu navyamedia
సినిమా వార్తలు

అఖండ.. అభిమానుల ఆనందహేల…

తెలుగు రాష్ట్రాల్లోనూ… పొరుగు ప్రాంతాల్లోనూ టాలీవుడ్ టాప్ స్టార్ నందమూరి బాలకృష్ణ సినిమా విడుదలైతే అభిమానులు పండుగ చేసుకుంటారు.

బాల‌య్య‌, బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ సినిమా విడుదలతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సినిమా విడుదలైన ప్రాంతాల్లో సినిమావాల్ పోస్టర్లలో హీరో బాలయ్య చిత్రపటానికి కర్పూర హారతులిచ్చారు. భారీ ఫ్లెక్సీలు కట్టి బాణాసంచాతో సంబరాలు జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త టిక్కెట్ల విధానాన్ని నిన్ననే అందుబాటులోకితీసుకొచ్చింది.

akhanda movie review

సాధారణంగా అగ్రహీరోల సినిమాలు విడుదలవుతున్న సందర్భంగా … హార్డ్ కోర్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా విడుదలయ్యే థియేటర్లలో బెనిఫిట్ షోలు ప్రదర్శించే ఆనవాయితీ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్తవిధానంతో బెనిఫిట్ షోలకు అనుమతిలేదని థియేటర్ నిర్వాహకులు చేతులెత్తేశారు.

akhanda movie review

మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో బాలకృష్ణ సినిమా విడుదలవుతోందంటే నిబంధనలు తర్వాత అమలుచేసుకోమని థియేటర్ యామాన్యానికి సూచించారు. అభిమాన సంఘాలు పట్టుబట్టి బెనిఫిట్ షోలను ప్రదర్శించేవిధంగా కొన్ని చోట్ల థియేటర్ యాజమాన్యాన్ని ఒప్పించారు. బాలయ్య బాబును వెండితెరపై చూసుకుని కేరింతలు కొడుతూ సంబరాలు జరుపుకున్నారు. సినిమాథియేటర్లలోనూ అభిమానులు బాలకృష్ణకు కర్పూర నీరాజనాలు అర్పించారు. పుష్పార్చన చేశారు. అఖండజ్యోతులతో హారతులిచ్చారు. పులవర్షం కురిపించారు.

akhanda movie review

విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు వంటి నగరాల్లో బెనిఫిట్ షోలు ప్రదర్శించడానికి థియేటర్ యాజమాన్యాలు ముందుకురాలేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన టిక్కెట్ల ధరలతోనే బెనిఫిట్ షోలను ప్రదర్శించేవిధంగా బాలయ్య అభిమానులు విజయం సాధించారు. అభిమానుల ఒత్తిడితో సినిమా ప్రదర్శించడం తప్ప మరే మార్గం లేదని థియేటర్ యాజమాన్యాలు పేర్కొన్నాయి. పెద్ద సినిమాలు విడుదలైన నేపథ్యంలో టికెట్స్ రేట్లు విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని విజ్ఞప్తి థియేటర్ యజమానులు కోరుతున్నారు.

Related posts