telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నెహ్రు కుటుంబంపై టీవీ నటి అభ్యంతరకర వ్యాఖ్యలు… కేసు నమోదు

Payal-Rohatgi

ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు మోతీలాల్ నెహ్రూ కుటుంబంతోపాటు, మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ సతీమణిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రముఖ టీవీ నటి, రియాల్టీ స్టార్ పాయల్ రోహతగిపై రాజస్థాన్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీవీ నటి పాయల్ మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూల భార్యల నడవడికపై అసత్య, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ వీడియోను ఫేస్‌బుక్, వాట్సాప్‌లో పోస్టు చేశారు. దీనిపై రాజస్థాన్ యువజన కాంగ్రెస్ నాయకుడు ఛర్మేష్ శర్మ ఐటీ యాక్ట్ 66,67 ల కింద టీవీ నటి పాయల్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాయల్ మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మృతిపై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఛర్మేష్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

Related posts