telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రైతులతో గోక్కున్న వాళ్ళు ఎవరు బాగుపడలేదు..

Talasani Trs

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్‌ అయ్యారు. రైతు నడ్డి విరిచే విధంగా ఎన్డీయే చట్టాలు తెచ్చిందని.. రాజ్యసభలో నూతన వ్యవసాయ బిల్లును టిఆర్ఎస్ తో పాటు అన్ని పార్టీలు వ్యతిరేకించాయని గుర్తు చేశారు. డోర్లు మూసి, టీవీల లైవ్ లు ఆపి కొత్త వ్యవసాయ చట్టాన్ని పాస్ చేయించుకున్నారని.. దేశ చరిత్రలోనే రైతులను ఆదుకున్నది కేసీఆర్ ఒక్కరేనని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా నల్ల చట్టాలను కేంద్రం తెస్తోందని…భారతదేశంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని మండి పడ్డారు.విత్తనాలు, ఎరువులు రైతులకు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది అని.. రైతుల గురించి మాట్లాడే అర్హత కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. శివరాజ్ సింగ్ చౌహన్ నిన్నా, మొన్న కొత్త వ్యవసాయ చట్టం పై ఏం మాట్లాడారో అందరూ చూసారని తెలిపారు.
వ్యాపారులు అందరూ బంద్ కు సహకరించాలని..ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఎవర్ని పెంచిపోషించడం కోసం ఈ చట్టాలు తెచ్చారని.. భవిష్యత్ లో కేసీఆర్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఉద్యమం జరుగుతుందని హెచ్చరించారు. రైతులతో డ్రామాలు చేస్తే కేంద్ర ప్రభుత్వ పీఠం కదులుతదని ఫైర్‌ అయ్యారు. మేం ఎన్నికలకు భయపడ్డామని శివరాజ్ సింగ్ అనడం హాస్యాస్పదమని..ఇటువంటి ఎలక్షన్ లు ఎన్నో చూశామని పేర్కొన్నారు. మహారాష్ట్ర మాజీ సీఎం జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా తమపై చేసిన వ్యాఖ్యలు నీటిమాలిన చర్య అని…రైతులతో గోక్కున్న వాళ్ళు ఎవరు బాగుపడలేదని మండిపడ్డారు.

Related posts