దర్శకురాలు నందినీ రెడ్డి ఇటీవల “ఓ బేబీ” సినిమాతో ఘనవిజయం అందుకున్నారు. ప్రస్తుతం ఆమె తన తర్వాతి సినిమా పనులతో బిజీగా ఉన్నారు. స్వప్నా సినిమాస్ బ్యానర్‌పై ఓ సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన “లస్ట్‌స్టోరీస్”ను నందిని తెలుగులోకి రీమేక్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. హిందీలో బాగా రచ్చ చేసిన హాట్ వెబ్ సీరిస్ ‘లస్ట్ స్టోరీస్’. భర్త నుంచి సెక్స్ లో అసంతృప్తి పొందుతున్న ఒక ఆధునిక మహిళ పాత్రలో కియరా అద్వానీ నటించింది. అందుకు సంబంధించిన సన్నివేశాలను చాలా రియలిస్టిక్ గా చిత్రీకరించారు. లస్ట్ స్టోరీస్ లో నటించిన సమయంలో కియరాకు ఇంత పాపులారిటి లేదు. అయితే ఆ వెబ్ సీరిస్ హిట్ కావడంతో.. కియరా అద్వానీకి చాలా పేరు వచ్చేసింది. ఈ హాట్ వెబ్‌సిరీస్‌లో అమలాపాల్ నటించబోతోందని, దానిని నందిని రీమేక్ చేయబోతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ ప్రచారంపై ట్విటర్ ద్వారా నందిని స్పందించారు. “సబ్ టైటిల్స్ ఉన్న ‘లస్ట్ స్టోరీస్’ను రీమేక్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు. ఎందుకమ్మా.. ఏంటో ఈ వెరైటీ రూమార్స్” అంటూ నందిని ట్వీట్ చేశారు.
ఆ హీరో కూడా డ్రగ్స్ తీసుకునేవాడు… సీనియర్ హీరోయిన్ కామెంట్స్