telugu navyamedia
సినిమా వార్తలు

లవ్‌స్టోరీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

సెన్సిబుల్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో ఇటీవల విడుదలైన పాటలు, ప్రోమోలు సినిమాపై ఆ అంచనాలను మరింత పెంచాయి. ఈ సినిమా విడుదల కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఈ పాటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

ఇక ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడం .. పలు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఈనేపధ్యంలో ‘లవ్ స్టోరీ’ విడుదల తేదీని కూడా ప్రకటించారు మేకర్స్‌. ఈ సినిమా మేకర్స్ ‘వినాయకచవితి’ పండుగ సందర్భంగా సెప్టెంబర్ 10వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌.ఎల్‌.పి.సంస్థ నిర్మించిన్న ఈ సినిమా పవన్‌ సి.హెచ్‌ సంగీతం అందించారు.

Related posts