telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

పొడవాటి జుట్టు కోసం .. ఇలా.. !

tips for long healthy hair

ఎటు చూసిన నేటి కాలంలో, ఎక్కడైనా వాతావరణ కాలుష్యం రాజ్యం ఏలుతుంది. దీనితో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిలో ప్రధానంగా జుట్టురాలే సమస్య. దీనితో అనేక ప్రయోగాలు చేసి ఇప్పటికే మరికాస్త విసిగిపోయి ఉంటారు. అయితే దీనికి శాశ్వత పరిష్కారం.. ఏదైనా ఉందా.. అంటే ఉందనే అంటున్నారు… అవేమిటో చూద్దామా..

జుట్టు సమస్యకు కాలుష్యంతో పాటుగా, తీసుకునే ఆహారంలో తగిన పోషణ లేకపోవడం కూడా ప్రధాన కారణంగా చెప్పాలి. అందుకే రోజు తీసుకునే ఆహారంలో తగిన విటమిన్లు, మినరల్స్ ఖచ్చితంగా ఉండేట్టుగా జాగర్తపడాలి. ముఖ్యంగా తాజా కూరగాయలు, ఆకుకూరలు, గుడ్లు, ఓట్స్, తృణధాన్యాలు వంటివి చాలా మేలు చేస్తాయి. అలాగే ప్రోటీన్, అయోడిన్, బీటా కెరోటిన్ లాంటివి కూడా పుష్కలంగా ఉండేట్టుగా జాగర్తపడాలి. దీనితో కేశాలకు సరైన పోషణ లభించి, జుట్టు దృడంగా ఉంటుంది. దీనితో జుట్టురాలు సమస్య తగ్గుతుంది.

రోజు కాకపోయినా, కనీసం రెండు రోజులకు ఒకసారైనా తలంటు స్నానం చేసితీరాలి. తలంటు సమయంలో బాగా వేడిగా కాకుండా గోరువెచ్చటి నీటిని వాడాలి. బాగా వేడి నీటిని వాడితే జుట్టు రాలటం పెరుగుతుంది.

ఇక జుట్టుకు పట్టించే నూనెలు, తలస్నానానికి ఉపయోగించే షాంపూ లను జాగర్తగా ఎంచుకోవాలి. ఇక వాటిని జుట్టుకు పట్టించేప్పుడు కూడా జాగర్తగా కుదుళ్లవరకు పెట్టి, మర్దనా చేయాలి. గోళ్ళతో కుదుళ్లను గోకేయకుడదు.. అలా చేస్తే జుట్టు రాలిపోతుంది.

tips for long healthy hairతలస్నానం అనంతరం జుట్టును సహజంగా ఆరనివ్వాలి. లేదా టవల్ తో తుడుచుకుంటూ ఆరనివ్వాలి. అంతేగాని డ్రైయ్యర్ లాంటివి వాడితే జుట్టు చిట్లి, రాలిపోతుంది.

జుట్టు దువ్వుకునేప్పుడు కూడా జాగర్తలు పాటించాలి. మరి దగ్గరగా పళ్ళు ఉన్న దువ్వెనతో కాకుండా, కాస్త దూరంగా పళ్ళు ఉన్న దువ్వెనతో జుట్టు దువ్వుకోవాలి, అది కూడా కింద నుండి. తడిగా ఉన్న జుట్టును దువ్వరాదు, జుట్టు రాలిపోతుంది.జుట్టుకు అప్పుడప్పుడు కండీషనర్ లు కూడా వాడుతుండాలి. దీనితో లోపించిన పోషణ ఏమైనా ఉంటె, అది కూడా లభించి, వెంట్రుకలు దృడంగా తయారవుతాయి. దీనితో వెంట్రుకలు రాలటం తగ్గిపోతుంది.

Related posts