ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు డీజీపీపై ఫైర్ అయ్యారు. రిషికొండలో ఏపీ బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా విగ్రహాల ధ్వసం, తిరుపతి ఉప ఎన్నికలపై ఏపీ బీజేపీ నేతలు చర్చించారు. అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ.. హిందువుల మనోభావాలను దెబ్బతీయాలన డీజీపీ అనుకుంటున్నారా ? అని సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిత్లీ తుఫాన్‌లో విగ్రహం ధ్వంసమైందని సోషల్ మీడియాలో పెడితే కేసు పెట్టారని… కానీ మేం ధ్వంసం చేశామని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజమండ్రిలో ఓ విగ్రహం ధ్వంసమైతే మూడు పార్టీల నేతలు పూజారిని తీసుకెళ్లి సంప్రోక్షణ చేయించారన్నారు. ఈ ఘటనలోనూ బీజేపీ కార్యకర్తను అరెస్ట్ చేశారని… ఎప్పుడో ధ్వంసం చేసిన విగ్రహాలకు సంబంధించి బీజేపీపై కేసు పెట్టారని పేర్కొన్నారు. ఇది పనికిమాలిన చర్య అని విగ్రహాల ధ్వంస కేసులో ప్రభుత్వానికి సీరియస్ నెస్ లేదనడానికి ఇది అద్దం పడుతోందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. విగ్రహాల ధ్వంసం కేసుల్లో డీజీపీ.. బీజేపీ పేరు పలుకుతున్నారని..డీజీపీని వెంటనే ఆ పోస్ట్ నుంచి తొలగించాలని సీఎంను డిమాండ్ చేస్తున్నామని సోము వీర్రాజు తెలిపారు.
previous post