telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్-3లోకి సుడిగాలి సుధీర్ ఎంట్రీ ?

Jabardasth-Sudheer

జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో చమ్మక్ చంద్ర, షకలక శంకర్ హీరోలుగా ఇప్పటికే తమ అద‌ృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. జబర్దస్త్ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు సుడిగాలి సుధీర్ బుల్లితెరపై మరికొన్ని టీవీ షోలు చేస్తూ బిజీగా మారిపోయాడు. అడపాదడపా సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో మెరుస్తున్నాడు. అలాంటి సుధీర్ త్వరలోనే సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా దర్శనమివ్వబోతున్నాడు. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాలో అతను హీరోగా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టిన సుధీర్.. ఇందుకోసం బిగ్‌బాస్ ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకున్నాడు. త్వరలోనే బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చి సినిమాను ప్రమోట్ చేసుకునే పనిలో ఉన్నాడు. కాగా,జబర్దస్త్ షో ద్వారా ఇప్పుడదే దారిలో సుడిగాలి సుధీర్ కూడా వెళ్తుండటంతో.. హీరోగా సుధీర్ ప్రేక్షకులను మెప్పిస్తాడా లేడా అనేది చూడాలి.

Related posts