ఉద్యోగులకు జీతాలు ఇవ్వట్లేదని అనడం దారుణమని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సకాలంలో జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.
అన్నిప్రాంతాల అభివృద్ధిని కాంక్షించే రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ ఓ ఆలోచన చేశారని అన్నారు.ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఆర్థిక సంఘం సంఘం రాష్ట్రాలకు ఆర్థిక సాయానికి సిఫారసు చేస్తుందని చెప్పారు. గతంలో చేసిన సిఫారసులకు, ఇప్పటికీ ఆర్థిక అవసరాలు మారాయని బుగ్గన తెలిపారు. అందుకే రివైజ్డ్ మెమోరాండం కోరామని, ఈ రోజు విజయవాడలో సీఎం జగన్ తో ఆర్థిక సంఘం భేటీ అయిందని చెప్పారు. ఏపీకి అవసరమైన ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరమని సీఎం సూచిస్తారని బుగ్గన పేర్కొన్నారు.