ప్రజాస్వామ్యన్ని నిలబెట్టడానికి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను సాగర్ నియోజక వర్గంలో గెలిపించానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత జనారెడ్డి. టీఆరెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని…టీఆరెస్ పార్టీకి గుణపాఠం చెప్పే ఎన్నికలే ఈ సాగర్ ఎన్నికలని ఆయన పేర్కొన్నారు. జానారెడ్డి అభివృద్ధి ఏం చేయలేదని కొంత మంది ప్రచారం చేస్తున్నారని… ఏం చేయకపోతే తనను 7 సార్లు ఎమ్మెల్యేగా ఎలా గెలిపిస్తారని తెలిపారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమన్నారు. జానారెడ్డి చేసిన అభివృద్ధి ప్రజలందరికీ తెలుసు అని తెలిపారు. సాగర్ లో కాంగ్రెస్ గెలవడం అంటే ప్రజా చైతన్యానికి గీటు రాయి అని..ఇక్కడ ఓడిపోతామనే భయం కాంగ్రెస్ కు లేదరని వెల్లడించారు. టీఆరెస్, బీజేపీలకు సాగర్ ఉపఎన్నికలో ఓడిపోతామనే భయం ఉందని… ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ కు ఏ పార్టీ పోటీ కాదన్నారు. ప్రజల మీద తనకు విశ్వాసం ఉందని… జానారెడ్డి గెలుపు కాంగ్రెస్ కు మలుపు అని పేర్కొన్నారు.
మంత్రి పదవి కావాలని అడగలేదు: ఎమ్మెల్యే రోజా