telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్-3 : మహేష్ ఎలిమినేట్… ఎలా వచ్చాడో అలాగే బయటకు…!

mahesh vitta will leave from house

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ 3 నుండి ఈ వారం మ‌హేశ్ విట్టా ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం ఎలిమినేష‌న్‌కు వ‌రుణ్ సందేశ్‌, రాహుల్‌, మ‌హేశ్ నామినేట్ అయ్యారు. ముగ్గురు బ‌ల‌మైన పోటీనిచ్చేవాళ్లే అయినా.. మ‌హేశ్‌కు మిగిలిన ఇద్ద‌రి కంటే క్రేజ్ త‌క్కువే. ఓట్లు మ‌హేశ్‌కి త‌క్కువ‌గా రావ‌డంతో ఆయ‌న ఎలిమినేట్ అయిన‌ట్లు నాగార్జున ప్ర‌క‌టించారు. ఇక బిగ్‌బాస్ హౌస్‌లో బాబాభాస్క‌ర్‌, వరుణ్ సందేశ్‌, వితిక‌, రాహుల్‌, అలీ రెజా, శివ జ్యోతి, శ్రీముఖి ఉన్నారు. మ‌రి వ‌చ్చేవారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ వారం ఎలిమినేష‌న్‌లో ముందుగా రాహుల్ సేఫ్ అయ్యాడు. చివ‌ర‌గా వ‌రుణ్ సందేశ్‌, మ‌హేశ్ మ‌ధ్య ఎలిమినేష‌న్ జ‌రిగింది. ఈ ఆదివారం నాగార్జున స‌భ్యులను గ్రూపులుగా డివైడ్ చేసి ఒక్కొక్క సినిమా టైటిల్ ఇచ్చి బొమ్మ‌ల‌తో దాన్ని అర్థ‌మ‌య్యేలా చెప్ప‌మ‌ని చెప్పాడు. గ్రూపు స‌భ్యులు ఈ టాస్క్‌ను బాగా ఎంజాయ్ చేశారు.శ్రీముఖి, అలీ, వితిక‌, రాహుల్ గ్రూప్ ఎక్కువగా స‌రైన స‌మాధానాలు చెప్పింది. అలాగే అమ్మ‌తోడు అన్నీ నిజ‌మే చెబుతా! అనే రౌండ్ పెట్టి కొన్ని ప్ర‌శ్నలు అడిగారు. ఈ రౌండ్ స‌ర‌దాగా సాగింది. చివ‌ర‌కు మ‌హేశ్ ఎలిమినేట్ అయిన‌ట్లు నాగ్ ప్ర‌క‌టించారు. ఫన్ బకెట్ లో కామెడీతో మెప్పించిన మహేష్ ఆ క్రేజ్ తో సినిమాల్లో అవకాశం తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ హౌజ్ లో దాదాపుగా మహేష్ ఒక కామన్ మెన్ లానే ఎంట్రీ ఇచ్చాడని చెప్పొచ్చు. తెర మీద కామెడీ చేసే మహేష్ పర్సనల్ లైఫ్ లో సీరియస్ గా ఉంటాడని తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చే టైంలో పంచె కట్టుతో వచ్చాడు మహేష్. నిన్న ఎలిమినేట్ అయ్యే టైం లో కూడా అదే పంచెతో కనిపించాడు. ఇక కేవలం 3 వారాలు మాత్రమే ఉన్న ఈ షోలో ఇంకా ఎవరు బయటకు వస్తారో చూడాలి.

Related posts