ప్రేమ తలుపు తట్టాక
మనసు ఇచ్చిపుచ్చుకున్నాక
రుతువులన్నీ వసంతాలే
గంటలన్నీ జ్ఞాపకాలే!
వలపు చిగురు తొడిగాక
చిలిపి తలపు మొలిచాక
మాటలన్నీ పాటలే
రాతలన్నీ కవితలే!
ఆమె/అతడి ఊహా మెదిలాక
ఆ ఊసులు విన్నాక
లోకమంతా అద్భుతమే
మనసంతా విస్తృతమే!
జీవితంలో ఒక్కసారైనా ప్రేమించాక
హృదయంలో ఒక్కరికైనా చోటిచ్చాక
ప్రేమ సఫలమైనా విఫలమైనా
మనసొక అందాల నందనవనమే!
జ్ఞాపకాల్ని నింపుకున్న ఆనంద సాగరమే!
– సాంబమూర్తి లండ.