telugu navyamedia
సినిమా వార్తలు

నాపై త‌ప్పుడు వార్త‌లు రాస్తే కోర్టుకు వెళ్తా..

మా ఎన్నికల్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌కు చెందిన 11మంది రాజీనామా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో సినీ నటి, యాంకర్ అనసూయ సైతం పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో మా ఎన్నికలపై స్పందించిన అనసూయ తన ప్రమేయం లేకుండా తప్పుడు వార్తలు రాసే వాళ్లపై కోర్టుకెళతానని అనసూయ హెచ్చ‌రించారు.

Anasuya Bharadwaj | Book, Contact, Price, Event, Show Booking | LiveClefs

యూట్యూబ్‌ ఛానళ్లు ఇష్టమొచ్చినట్లు రాస్తే ఊరుకునేది లేదని, ఎవరి జీవితాన్ని వారు జీవించనివ్వాలని హితవు పలికారు. “నేను మెజార్టీలో ఉన్నానని కొన్ని ఛానళ్లు ప్రసారం చేశాయి. నేను మీడియాలో ఉంటే న్యూస్‌ రిపోర్ట్‌ చేయడాన్ని ఎంచుకుంటాను. క్రియేట్‌ చేయను. గాలి వార్తలు చెప్పను. కచ్చితంగా ఎన్నికల అధికారులు ప్రకటిస్తేనే చెబుతాను. ఓట్ల లెక్కింపు దగ్గర ఎవరో ఇచ్చిన సమాచారాన్ని నేను నమ్మను. ‘మా’ ఎన్నికల్లో గెలిచి ఉంటే, మరింత సర్వీస్‌ చేసేదాన్ని. ఇప్పుడు కూడా సమయం ఉంటే తప్పకుండా చేస్తా. గెలుపోటములు పట్టించుకోను.

Police Complaint Lodged Against Telugu Actor Anasuya Bharadwaj For Breaking The Phone Of A Fan | India.com

వరుస షూటింగ్‌ల కారణంగా గత 40 రోజులుగా సరిగా ఇంటికి వెళ్లలేకపోయాను. పని నుంచి నేరుగా వచ్చి ఓటేశాను. ఆ తర్వాత అక్కడే ఉన్నాను. ప్రెసిడెంట్‌ ఓట్ల లెక్కింపు మొదలు పెట్టకుండానే ఫలితాలను మీడియా ప్రకటించింది. నేను చాలా ధైర్యవంతురాలిని. ఓడిపోయానని ఎదుటవాళ్లు చెబితే ఒప్పుకొనే దాన్ని కాదు. నా గురించి తెలుసుకోకుండా తప్పుడు వార్తలు రాస్తే కోర్టుకు వెళ్తా” అని అనసూయ ప‌లు మీడియా వాళ్ళ‌కి హెచ్చ‌రించారు.

Telugu Actress Pics | Telugu Actress Photos | Telugu Actress Gallery | Telugu Actress Wallpapers

ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి ఈసీ మెంబర్‌గా పోటీ చేసిన ఆమె ఓడిపోయారు. ఆదివారం ఓట్ల లెక్కింపు సందర్భంగా తొలుత ఆమె విజయం సాధించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు మరుసటి రోజుకు వాయిదా వేయడం వల్ల ఆమె ఫలితంపై సందిగ్ధత నెలకొంది. మరుసటి రోజు జరిగిన ఓట్ల లెక్కింపులో అనసూయ ఓడిపోయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. దీనిపై అనసూయ వ్యంగ్యంగా ట్వీట్ పెట్టింది..

Related posts