telugu navyamedia
ఆంధ్ర వార్తలు

దుర్గమ్మ సేవలో ఏపీ సీఎం జ‌గ‌న్‌..

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా మంగళవారం మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి పాల్గోని.. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు.

 AP CM Jagan presents silk robes to Goddess Kanaka Durga

వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. తొలుత ఇంద్రకీలాద్రి పైకి చేరుకున్న ముఖ్యమంత్రికి దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పైలా సామినాయుడు, శాసన సభ్యులు మల్లాది విష్ణు, నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి, ఆలయ ఈఓ డి. భ్రమరాంబ. స్థానాచార్యులు, వైదిక కమిటీ సభ్యులు,ఆలయ ప్రధానార్చకులు,ఇతర అధికారులు ఆలయ మర్యాదలతో వేద మంత్రోచ్ఛారణలతోఘ‌నంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.

 AP CM Jagan presents silk robes to Goddess Kanaka Durga

కాగా.. ఇంద్రకీలాద్రి ప‌ర్య‌ట‌న‌లో అమ్మ‌వారి చ‌రిత్ర‌ను తెలిపే ఓ ప్ర‌త్యేక మైన షో ప్రారంభించాల్సి ఉండ‌గా కొన్ని అని వార్య కారాణాల దృష్యా అది వాయిదా ప‌డిన‌ట్లు స‌మాచారం.

Related posts