telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్‌-రానా సినిమాలో మరో స్టార్‌!

టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణాదగ్గుబాటి ల కాంబినేషన్ లో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా నిర్మిస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ నేడు ప్రారంభం అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనగా యాక్షన్ సన్ని వేశాలకు శ్రీకారం చుట్టారు చిత్ర దర్శకుడు సాగర్.కె.చంద్ర. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్‘ అందిస్తున్న విషయం విదితమే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి లు పాల్గొనగా పదిరోజులపాటు హైదరాబాద్ లో చిత్రం షూటింగ్ జరుగుతుందని తెలిపారు నిర్మాత. ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా నుంచి మరో అప్డేట్‌ వచ్చింది. దర్శకుడిగా సత్తా చాటుతూనే అప్పుడప్పుడూ తనలోని నటుడిని బయటకు తీసే వివి వినాయక్‌ మరోసారి ఈ సినిమా కోసం ముఖానికి రంగు వేసుకున్నాడట. పవన్‌-రానా కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఓ కీలక పాత్రలో వినాయక్‌ నటిస్తున్నాడని సమాచారం. ఇప్పటికే హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగిన షూటింగ్‌లో వినాయక్‌ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.

Related posts