telugu navyamedia
సినిమా వార్తలు

“శ్రీదేవి బంగ్లా” ట్రైలర్… షాకిచ్చిన బోనీ కపూర్

Priya-Prakash-Varrier

కన్నుగీటి పాపులారిటీ దక్కించుకున్న స్టార్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ ప్రస్తుతం బాలీవుడ్ లో “శ్రీదేవిబంగ్లా” అనే సినిమాలో నటించింది. ప్రశాంత్ మాంబుల్లి వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఈ సినిమాలో శ్రీదేవి అనే పాత్రలో ప్రియా ప్రకాష్ వారియర్ రీల్ లైఫ్ హీరోయిన్ గా కనిపించనుంది. ట్రైలర్ తోనే ”ఓ నటిగా నేను చాలా అదృష్టవంతురాలిని. నాకు జీవితంలో దేవుడు అన్నీ ఇచ్చాడు. పేరు, డబ్బు, సంతోషం… ప్రపంచంలో ఎక్కడకి వెళ్లినా నాకు అభిమానులు ఉన్నారు. కానీ..” అని డైలాగ్ చెప్పే సమయంలో కాలింగ్ బెల్ మోగుతుంది. ఆ తరువాత ప్రియా వెక్కి వెక్కి ఏడుస్తూ, చెడు అలవాట్లకు దగ్గరై చివరకి బాత్ టబ్ లో శవంగా కనిపిస్తుంది. ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు దివంగత నటి శ్రీదేవి మరణాన్ని గుర్తు తెచ్చేలా ఉందని అంటున్నారు.

అయితే బాలీవుడ్ నిర్మాత, దివంగత శ్రీదేవి భర్త బోణీకపూర్ ఈ ట్రైలర్ చూసి నటి ప్రియా ప్రకాష్ వారియర్, సినిమా దర్శకుడు ప్రశాంత్ మాంబుల్లిలకు లీగల్ నోటీసులు పంపించారు. ఈ విషయంపై స్పందించిన దర్శకుడు ప్రశాంత్ శ్రీదేవి అన్నది సాధారణంగా అమ్మాయిలు పెట్టుకునే పేరు అని, ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ కథ అని, ఏదేమైనా కేసుని ధైర్యంగా ఎదుర్కొంటామని అన్నారు. ప్రియా ప్రకాష్ కూడా మీడియాతో మాట్లాడుతూ ”ఇది శ్రీదేవి సినిమానా కాదా అని తెలుసుకోవాలంటే ముందు సినిమా చూడాలి. ఇందులో నేను శ్రీదేవి అనే సూపర్ స్టార్ పాత్రలో నటిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

Related posts