telugu navyamedia
సినిమా వార్తలు

63 కోట్లు కొల్లగొట్టిన “ఇస్మార్ట్ శంకర్”

Ismart-Shnkar

ఎన‌ర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన “ఇస్మార్ట్ శంక‌ర్” గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “ఇస్మార్ట్ శంక‌ర్” చిత్రంలో రామ్ స‌ర‌స‌న నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా మణిశర్మ సంగీతం అందించాడు. జూలై 18న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుంటూ తొలి రోజే ఊహించ‌ని క‌లెక్ష‌న్స్ సాధించింది. పూరి జగన్నాథ్ స్టైల్ లో సాగే సైంటిఫిక్ మర్డర్ మిస్టరీ చిత్రం కాగా, మెమోరీ ట్రాన్స్‌ఫర్ అనే కొత్త అంశాన్ని టచ్ చేస్తూ ఈ చిత్రాన్ని హైదరాబాదీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. చాలా రోజుల త‌ర్వాత ఇటు పూరీకి ఇటు రామ్‌ ఖాతాలో “ఇస్మార్ట్ శంక‌ర్”తో హిట్ పడింది. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన “ఇస్మార్ట్ శంక‌ర్” ఓవర్సీస్ తప్పించి.. మిగిలిన అన్ని ఏరియాల్లో లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ఇస్మార్ట్ శంకర్‌గా రామ్ నటనను అందరు మెచ్చుకుంటున్నారు. ఈ ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ తొలి నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.48 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం ఆరు రోజుల్లో రూ.56 కోట్లు వసూలు చేసింది. 8 రోజుల్లో రూ.61 కోట్లు రాబట్టింది. తాజాగా 9 రోజుల‌లో 63 కోట్ల గ్రాస్ వ‌సూళ్ళు సాధించిందని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. రీసెంట్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన డియ‌ర్ కామ్రేడ్ చిత్రం విడుద‌ల కాగా, ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ రావ‌డంతో ఇస్మార్ట్ శంక‌ర్ హ‌వా కొద్ది రోజుల వ‌ర‌కు ఇలానే ఉంటుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. పూరీ జ‌గ‌న్నాథ్ స్టైలిష్ టేకింగ్, న‌భా న‌టేష్‌, నిధి అగ‌ర్వాల్‌ల గ్లామ‌ర్ సినిమాకి చాలా ప్ల‌స్ అయింది. ఈ చిత్రంతో రామ్ త‌న కెరియ‌ర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ళు సాధించిన‌ట్టుగా తెలుస్తుంది.

Related posts