telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నటీనటులకు మరో అవకాశం లేదు… అందుకే ఆ పని బెటర్… : బిపాసాబసు

Bipasa

ప్రపంచ దేశాల్లో వీరవిహారం చేస్తున్న కరోనా సినీ ఇండస్ట్రీని కలవరపెడుతోంది. ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ‘కసౌతి జిందగీ కే-2’ నటుడు పార్థ్‌ సమతాన్‌కు కోవిడ్‌-19 పాజిటివ్‌ అని తెలియడంతో.. బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు నటీనటులకే ఎక్కువ ఉన్నాయని, అందుకే ఇంకొంతకాలం పాటు షూటింగ్స్ నిలిపివేస్తేనే బెటర్ అని తెలుపుతూ బిపాసా పోస్ట్ పెట్టింది. ”షూటింగుల్లో ప్రతి ఒక్కరూ పీపీఈ కిట్లు, గ్లవ్స్, మాస్కులు, షీల్డులు ధరిస్తున్నారు. కానీ నటీనటులకు మాత్రం ఆ అవకాశం లేదు. ఒకవేళ మాస్కులు ధరించి నటిద్దామన్నా కుదరదు. కాబట్టి వాళ్లు ఎలాంటి రక్షణా లేకుండానే నటించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ కారణంగానే నటీనటులకు కరోనా సోకే ప్రమాదం ఎక్కువ. సో.. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేంత వరకు అన్నిరకాల షూటింగులను నిలిపేస్తేనే మంచిది” అని బిపాసా తన పోస్ట్‌లో పేర్కొంది. ఇటీవలే అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ లాంటి సెలబ్రిటీలతో పాటు పలువురు సినీ, టీవీ కళాకారులు కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే.

Related posts