యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పెషల్ డ్యాన్స్‌తో అలరించనుంది. బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేశ్, ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. “బాహుబలి” తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంపై ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ప్రభాస్ కు ఓ పాత్రలో నటించాలని ఉందట. అదేంటంటే… అర్జునుడి పాత్ర. మన ఇతిహాసాల్లో మహాభారతానికి ప్ర్యతేకమైన స్థానం ఉంది. మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి కూడా మహాభారతాన్ని సినిమా రూపంలో తెరకెక్కించాలనే కోరిక ఉన్నట్లు ఇది వరకు చెప్పేశారు. మరోవైపు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ “మహాభారతం” చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం రూ .1000 కోట్ల బడ్జెట్‌తో చిత్రీకరించబడుతోంది. ఒకవేళ మహాభారతాన్ని సినిమాగా చేస్తే… కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, ద్రౌపది, భీముడు.. సహా పలు పాత్రల్లో ఎవరు నటిస్తారనే దానిపై పలు ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఈ క్రమంలో “సాహో” ప్రమోషన్స్‌లో భాగంగా బెంగళూరు చేరుకున్న ప్రభాస్‌ను విలేకరులు అసలు మహాభారతంలో నటించే అవకాశం వస్తే.. మీరు ఏ పాత్రలో నటించాలనుకుంటున్నారని అడిగితే.. దానికి ఆయన అర్జునుడు పాత్ర చేయాలనుకుంటున్నట్లు చెప్పారట. ప్రస్తుతం ప్రభాస్ ఆల్ ఇండియా స్టార్‌గా మారారు. ఆయన ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని రేపు మహాభారతాన్ని సినిమాగా తెరకెక్కించబోయే దర్శక నిర్మాతలు ప్రభాస్ కోరికను తీరుస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
previous post
కొత్త పార్టీల ప్రభావం అంతగా ఉండదు: బాలకృష్ణ