telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగా డాటర్ హాట్ ఫోటో వైరల్… !

Nagahsourya

మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు గారాల ప‌ట్టి నిహారిక తొలిసారి “ఒక మ‌న‌సు” చిత్రంతో వెండితెర అరంగ్రేటం చేసింది. మొదటి చిత్రమే ఈ ముద్దుగుమ్మకు నిరాశ‌ను మిగిల్చింది. ఈ సినిమాలో నీహారిక నటనపై విమర్శలు వచ్చాయి. దీంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చి వెబ్ సిరీస్ చేసింది. ఆ వెబ్ సిరీస్ కు మంచి గుర్తింపు రావడంతో “హ్య‌పీ వెడ్డింగ్” అనే చిత్రంలో నటించింది నిహారిక‌. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. ఇక ఇటీవల “సూర్య‌కాంతం” చిత్రంతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాగా… ఈ చిత్రం కూడా నీహారికను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇక వెబ్‌సిరీస్‌ల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నిహారిక తన అందంతో, క్యూట్‌నెస్‌తో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆమె ప్రస్తుతం సినిమాలు చేయడం లేదు. అయితే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా మాత్రం అభిమానులతో టచ్‌లో ఉంది. గతంలో లేని విధంగా గ్లామరస్ ఫొటోలు పోస్ట్ చేస్తోంది. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నిహారిక షేర్ చేసిన హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో సాంప్రదాయ దుస్తుల్లో దిగిన ఫొటోలను మాత్రమే షేర్ చేసిన నిహారిక.. ఇటీవల ట్రెండ్ మార్చింది. హాట్ ఫొటోలను షేర్ చేసింది. తాజాగా మరోసారి నిహారిక ఓ హాట్ ఫొటోను పోస్ట్ చేసింది. బ్లాక్ అండ్ బ్లాక్‌లో సూపర్ మోడల్ తరహాలో నిల్చుని ఫొటోకు ఫోజిచ్చింది. ఈ ఫోటోకు `ఏస్ ఆఫ్ స్పేడ్స్` అనే క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది.

Related posts