telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మే… : మెగాస్టార్

Chiru

మెగాస్టార్‌ చిరంజీవి తన తల్లి అంజనాదేవి కరోనాపై పోరులో భాగంగా మాస్క్‌లు కుట్టారని వచ్చిన వార్తపై స్పందించారు. అంజనాదేవి గత 3 రోజులుగా తన స్నేహితురాళ్లతో కలిసి 700 మాస్క్‌లు కుట్టారని, వీటిని అవసరమైన వారికి అందజేస్తున్నారనే వార్త సామాజిక మాధ్యమాల్లో ఫోటోలతో పాటూ వైరల్‌ అయ్యాయి. తన వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆమె సమాజం కోసం తనవంతు బాధ్యతను నెరవేరుస్తున్నారని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఆ ఫోటోల్లో ఉంది తన తల్లి అంజనాదేవి కాదని ట్విటర్‌లో స్పష్టత ఇవ్వడమే కాకుండా, ఆ ఫోటోల్లో ఉన్న మహిళను చిరంజీవి అభినందించారు. కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మేనని పొగడ్తలతో ముంచెత్తారు.

Related posts